భర్త చేతిలో తన్నులు తిన్న యాంకర్‌ లాస్య, ఆ విషయంలో గొడవ రావడంతో..!

లాస్య.. మంజునాథ్‌ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తామిద్దరం ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నాం అని చెప్పి అందరికి షాక్‌ ఇచ్చింది. వివాహం తర్వాత కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. లాస్య ప్రేమ వివాహం చేసుకుంది. లాస్య భర్త పేరు మంజునాథ్. కాగా మంజునాథ్ చేతిలో దెబ్బలు తింది లాస్య. భర్త లాస్యను ఎందుకు కొట్టాడు?

ఇద్దరి మధ్య ఎందుకు గొడవైందని పరిశీలిస్తే… ఇది నిజం గొడవ కాదు. ఉత్తుత్తి గొడవే. ఓ ఫన్నీ రీల్ చేసిన లాస్య ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. బాగా వైరల్ అవుతున్న కుమారి ఆంటీ డైలాగ్ తో లాస్య రీల్ చేసింది. భర్తకు చేపల కూర వడ్డించిన లాస్య ‘మీది మొత్తం థౌసండ్. రెండు లివర్లు ఎక్స్ట్రా’ అని చెప్పింది. ఆ మాటకు మంజునాథ్ లాస్య మీదకు కుర్చీ ఎత్తాడు.

జస్ట్ ఫర్ ఫన్… మీరు ఇష్టపడతారని భావిస్తున్నా… అని సదరు వీడియోకి లాస్య కామెంట్ పెట్టింది. లాస్య మంజునాథ్ చేసిన ఈ రీల్ వైరల్ గా మారింది. కాగా లాస్యకు ఇద్దరు కుమారులు. తన అందమైన ఫ్యామిలీని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి పరిచయం చేస్తుంటుంది లాస్య.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *