పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు ఒకరంటే ఒకరు ఇష్టపడి చేసుకునే ప్రేమ పెళ్లిళ్లు పెటాకులవుతున్నాయి. చిన్నచిన్న విషయాలకే విడాకుల వరకు వెళ్తున్న ఈ తరం దంపతుల పోకడ పాతతరం వారికి ఆందోళనకు కారణమవుతోంది. అయితే అందంగా సాగుతున్న జీవితం, రత్నాల్లాంటి పిల్లలు, అంతలోనే భార్యభర్తల మధ్య ఉన్నట్లుండి పెద్ద అగాధం. దీనికి కారణం అక్రమ సంబంధం. అక్రమ సంబంధం దాంపత్య సుఖాన్ని పాడు చేస్తుంది. పచ్చని సంసారంలో చిచ్చు పెడుతుంది.
భాగస్వాములిద్దరిలో ఏ ఒక్కరి విషయంలో అయినా అక్రమ సంబంధం బయటపడితే, అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఏ స్త్రీ తన భర్త చేసిన ద్రోహాన్ని సహించదు. అలాగే ఏ పురుషుడు తన భార్య పరాయివాడితో చనువుగా ఉండటాన్ని భరించలేడు. వారితో ఇక కొనసాగడం కష్టంగా ఉంటుంది. మూడుముళ్ల బంధం ముళ్లకంచెలా మనసును గాయపరుస్తుంది. ఇది ఇద్దరు విడిపోయేలా, మరింతగా చెడిపోయేలా, తమ చేజేతులా జీవితం నాశనం చేసుకునే వరకు వెళ్తుంది. కానీ, ఈ కారణం ఏ పాపం తెలియని పిల్లలు అన్యాయానికి గురవుతారు.
తన భర్త సంసారానికి పనికి రాడని కొన్నాళ్లకు భార్యకు విషయం బోధపడింది. తనను అందరూ మోసం చేశారని గ్రహించింది. కానీ, అతడితో తెగదెంపులు చేసుకోవడాన్ని పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆమె మరొకరితో తన జీవితాన్ని, సర్వస్వాన్ని పంచుకుంది. ఇవి మాత్రమే కాకుండా కొంతమంది తమ భర్త బోరింగ్ అని, రొమాన్స్ తెలియదని, అందంగా లేడని, లేదా మరొకరికి ఆకర్షితం అయి, భర్త దూరంగా ఉంటాడని, పాత ప్రియుడి ప్రేమను వదులుకోలేక ఇలా ధర్మబద్ధం కానీ కారణాలకు కూడా అక్రమసంబంధాలు పెట్టుకున్న వారు ఉన్నారు.