సడన్ గా ఆగిపోయిన బిగ్ బాస్ రియాలిటీ షో, షాక్ లో బిగ్ బాస్ ఫ్యాన్స్.

ఇప్పటికే ఆరు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక లేటెస్ట్‌గా ఏడో సీజన్‌ షురూ అయ్యింది. ఈ సీజన్‌కు కూడా నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. ఈసారి మొదటి రౌండ్’లో 14 మందిని పిలిచారు.రెండో రౌండ్‌లో ఐదో వారంలో వైల్డ్ కార్డ్ పేరిట మరో ఐదుగురిని పిలిచారు. అయితే శనివారం, ఆదివారం మాత్రం లైవ్ ఆపేసేవారు. అయితే ఇప్పటికే 14 వారాలు పూర్తి చేసుకుని .. ఫినాలే లో అడుగుపెట్టింది. ఇక మరో మూడు రోజుల్లో షో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో గ్రాండ్ ఫినాలే కి సంబంధించిన సమాచారం ముందే లీక్ అయిపోతుందని లైవ్ ఆపేశారు.

గత సీజన్ లో కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ కి ముందు ఇలాగే లైవ్ ఆపేశారు. కానీ అప్పటికి ఫైనలిస్టులను ఇంకా ప్రకటించలేదు. అయితే అప్పుడు హోస్ట్ నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని చెప్పారు. ఇక చెప్పినట్లుగానే శ్రీ సత్యను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్. ఇక మిగిలిన ఐదుగురిని ఫైనలిస్టులుగా ప్రకటించారు. కానీ గత వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పలేదు. పైగా ఈ సీజన్ లో ఆరుగురు ఫైనలిస్టులు అంటూ అనౌన్స్ చేశాడు. కానీ సడన్ గా లైవ్ ఆపేయడంతో .. అసలు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా .. లేదా అని ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

అదే సమయంలో రోజూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఇచ్చే మజా ఆడియన్స్ మిస్ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తే మిడ్ వీక్ ఎలిమినేషన్ కి 50 – 50 ఛాన్స్ ఉంది. దీన్ని పక్కన పెడితే తమ ఫేవరేట్ కంటెస్టెంట్ ని గెలిపించుకునేందుకు ఆడియన్స్ తెగ ఓట్లు గుద్దేస్తున్నారు. నేటితో ఓటింగ్ ప్రక్రియ కూడా ముగిసిపోతుంది. దీంతో ఓటింగ్ లైన్స్ కూడా తెగ బిజీ గా ఉంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *