సాధారణంగా మనం తినే ఆహారంతోగాని, తాగే ద్రవపదార్థాలతోగాని, లాలాజలంతోగాని శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనిలో కొంత భాగం ఆమాశయం నుంచి త్రేన్పు రూపంలో బైటకు వెళ్లిపోతే మిగిలిన భాగం పేగులలోకి ప్రవేశించి, అక్కడనుంచి శరీరంలోకి కలిసిపోతుంది. చివరగా మిగిలిన సూక్ష్మాంశం, నత్రజనితో కలిసి మలద్వారం నుంచి వెలుపలకు గ్యాస్ రూపంలో వెళ్లిపోతుంది. అయితే నీటిలో పుదీనా ఆకులను, అల్లాన్ని వేసి మరిగించి ఈ నీటిని తాగడం వల్ల కూడా ఈ సమస్య నుండి బయట పడవచ్చు.
మనకు బయట అల్లం మురబ్బా దొరుకుతూనే ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం దీనిని కొద్ది పరిమాణంలో తీసుకోవడం వల్ల కూడా గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. ఒక ప్లేట్ లో జీలకర్రను తీసుకుని, జీలకర్ర మునిగే వరకు సమానమైన మోతాదులో నిమ్మరసం, అల్లం రసాన్ని పోసి ఎండబెట్టాలి. నీరు అంతా ఆవిరి అయిపోయి జీలకర్ర ఎండిన తరువాత దీనిని పొడిగా చేసి తడి లేని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఇలా నిల్వ చేసుకున్న పొడిని రోజూ అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ నీటిలో కలిపి తాగడం వల్ల కడుపులో గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
మనం తయారు చేసే వంటకాలలో శొంఠి పొడిని ఉపయోగించడం వల్ల ఈ సమస్య తగ్గడంతోపాటు మనం తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. జీలకర్రను వేయించి పొడిగా చేసి ఆ పొడిని ఒక గ్లాస్ మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల కడుపులో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. వారానికి ఒక్కసారి ముద్ద ఇంగువను కొద్దిగా వేడి చేసి చిన్న మాత్ర పరిమాణంలో తీసుకుంటూ ఉండడం వల్ల కూడా గ్యాస్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.