తెలుగు ఇండస్ట్రీలో రచయితలు, కెమెరామాన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ తర్వాత నిర్మాత, దర్శకులుగా మారారు. అలాంటి వారిలో ఒకరు మన్నం సుధాకర్ . టాలీవుడ్ నిర్మాత మన్నెం ప్రభాకర్ అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. తర్వాత ఇంటికి చేరుకున్న ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం క్షిణించడంతో ఆదివారం కన్నుమూశారు.
అయితే ఆయన వయస్సు 62 సంవత్సరాలు. కొద్దిరోజుల క్రితం ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కాలు జారి కిందపడ్డారు. అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటుండగా పరిస్థితి విషమించి చివరికి కన్నుమూశారు. మన్నం సుధాకర్ స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి. నా మనసిస్తారా, వాలి, సేవకుడు, తారకరాముడు, ఆక్రోశం తదితర సినిమాలను మన్నం సుధాకర్ నిర్మించారు.

మన్నం సుధాకర్ అంత్యక్రియలు కారుమంచిలో జరగనున్నాయి. మన్నం సుధాకర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 123తెలుగు.కామ్ తరఫున మన్నం సుధాకర్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.