విరాట్ కోహ్లీ మరదలు ఎవరో కాదు రుహాని శర్మ.. ఇక రూహానీ శర్మ అంటే ఎవరికి తెలియదు కానీ వెంకటేష్ హీరోగా చేస్తున్న సైంధవ్ మూవీ లో డాక్టర్ పాత్రలో నటించిన హీరోయిన్ అనగానే అందరూ గుర్తుపట్టేస్తారు. అయితే తాజాగా ఓ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన రుహానీ.. అక్కడ తన లైఫ్, మూవీ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. చిన్నప్పటి నుంచి వెంకీ సర్ సినిమాలు చేస్తూ పెరిగానని..
సైంధవ్ సినిమాలో నటించాక ఆయనకు పెద్ద అభిమానిగా మారానని.. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేయడం చాలా సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కోరిక ఉండేదని.. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చానని… ఇప్పుడు సైంధవ్ సినిమాలో డాక్టర్ పాత్ర పోషించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక అదే సమయంలో ఓ విలేఖరి మాట్లాడుతూ.. అనుష్క శర్మతో మీ అనుబంధం ఎలా ఉంటుంది ? అని ప్రశ్నించింది. దీంతో హీరోయిన్ రుహాణి ఒక్కసారిగా షాకయ్యింది.
ఈ విషయం గురించి ఎప్పుడూ ఎక్కడా మీడియా ముందు చెప్పలేదు.. మీకేలా తెలిసింది? అని తిరిగి క్వశ్చన్ చేసింది. ఇక ఆ తర్వాత రుహాణి మాట్లాడుతూ.. అనుష్క నాకు సోదరి అవుతుంది. విరాట్ బావ అవుతాడని తెలిపింది. “విరాట్ నాతో చాలా బాగుంటాడు. వాళ్లిద్దరూ ఫిల్టర్ లేకుండా చాలా సింపుల్ గా ఉంటారు. అది నాకు బాగా నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక రుహాణి శర్మకు విరాట్ బావ అవుతాడని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.