చిన్న వయసులోనే కమెడియన్ కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 32 ఏళ్ల నీల్ నందా మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న నీల్ నందా ఇంత చిన్న వయసులో చనిపోవండం దిగ్భ్రాంతికి గురిచేసిందని., అతను గొప్ప కామిక్ అంటూ గ్రేగ్ వీస్ ఆవేదన వ్యక్తం చేశారు.
భారత సంతతికి చెందిన నీల్ నందా మరణానికి గల కారణాలు తెలియరాలేదు. 2013లో ప్రముఖ షో జిమ్మీ కమ్మెల్ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే తనదైన పర్ఫామెన్స్ తో అందరి మనసు దోచాడు. నీల్ నందా ఎక్కువగా అట్లాంటాలోనే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు. నీల్ నందా అమెజాన్ ప్రైమ్ షోలు ఇన్ సైడ్ జోక్స్, హులు కమింగ్ టూ ది స్టేజ్ లో కూడా కనిపించి అందరినీ నవ్వించారు.
నీల్ నందా మరణ వార్త విని షాక్ కి గురయ్యాను.. కష్టపడి పనిచేసేవారిలో ఆయన ఒకరు అంటూ అమెరికన్ నటుడు మాట్ రైఫ్ అన్నారు. నీల్ నందా మరణ వార్త సోషల్ మీడియాలో వ్యాపించగానే నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.. ఆయన నివాళులర్పిస్తున్నారు.
RIP Neel Nanda. Just at a total loss for words here. One of the nice and hardest working ones we had 💔 pic.twitter.com/unFtmN2xoU
— Eli Olsberg (@EliOlsberg) December 23, 2023