యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శృతిహాసన్ తండ్రి సపోర్ట్ ఏమాత్రం తీసుకోకుండా సొంతంగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సంపాదించుకొని ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా వెలుగుతుంది. అయితే గత కొంతకాలంగా శృతిహాసన్ తన తల్లికి దూరంగా ఉంటుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్గా శృతిహాసన్ తల్లి సారిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శృతిహాసన్ తనను దూరంగా పెడుతుందని..
తన దగ్గరకు ఎక్కువగా రావటం లేదని, తనతో అసలు మాట్లాడటం లేదని వివరించింది. లాక్ డౌన్ టైం లో సారికకి తినడానికి తిండి లేదు, చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని.. అలాంటి సమయంలో శృతిహాసన్‌కి కమల్ హాసన్‌కి ఇద్దరికీ ఫోన్ చేసినా కూడా వాళ్లు ఎవ్వరూ ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ఇప్పటికి కూడా నా కష్టంతో నేను బ్రతుకుతున్నానని.. నాకు ఒక్క రూపాయి కూడా ఎవరు సహాయం చేయడం లేదని..

రూమ్ రెంట్ కట్టుకుంటూ.. నా లైఫ్ ని గడపడం చాలా కష్టంగా ఉంది అంటూ వివరించింది. ఇక ఈమె ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. స్టార్ హీరోయిన్ అయినా శృతిహాసన్ తల్లిని అలా దూరంగా ఉంచి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ.. స్టార్ హీరోయిన్గా కోట్లు వెనకేసుకుంటే సరిపోదు కన్నతల్లిని కూడా అర్థం చేసుకోవాలి అంటూ.. నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెట్టిజన్లు.