శ్రీ రామ నవమి శ్రీ రాముడు జన్మ దినం మాత్రమే కాదు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు.. రామయ్య రాజుగా పట్టాభిషేకం అయిన రోజు.. అవును చైత్ర మాసం నవమి రోజున విష్ణుమూర్తి మానవ రూపంలో శ్రీ రాముడిగా అవతారం ఎత్తాడు. వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కర్కాటక రాశిలో మధ్యాహ్నం 12 గంటలకు జన్మించాడు. అయితే శ్రీరామనవమి పండుగ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది? ఎలాంటి పనులు చేస్తే బాగా కలిసి వస్తుంది? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకుని ఆరోజును ప్రారంభిస్తే మంచి జరుగుతుంది. ఇలా చేస్తే శుభం ఇంటిని శుభ్రం చేసుకుని, ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాన్ని కట్టుకుని ఇంటిముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధం అవ్వాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకుని రామయ్య పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది. ఇక స్నానం చేసే నీటిలో గంగాజలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి, ఆపై చేతులలోకి నీళ్లు తీసుకుని అంజలి ఘటించి సూర్యభగవానుడికి నమస్కరించాలి.
ఈ పనులు చెయ్యండి ఆపై పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఉపవాస దీక్షను ఆచరిస్తాం అని ప్రతిజ్ఞ చేసి, పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీ రామ పరివార విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీ రామ రక్షా స్తోత్రం పఠించి, శ్రీ రామ కళ్యాణ మంత్రాలు వింటే, శ్రీ రాములవారి కళ్యాణ తలంబ్రాలు పోయడం చూస్తే సంవత్సరం అంతా ఆహారానికి లోటు ఉండదు. భార్యాభర్తలు ఇలా చెయ్యాలి శ్రీరామ నవమి రోజు స్వామివారికి నివేదించిన తర్వాత పానకం, వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది. శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు తగువులు ఆడుకోకుండా ఉంటే అంతా శుభం జరుగుతుంది.
దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది. ఎంత భక్తితో రాముని పూజించి, ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం చాలా మందికి ఉంది. కనుక శ్రీరామనవమి పండుగ రోజు పై ఉపచారాలతో శ్రీరాముని అత్యంత భక్తి భావంతో పూజించండి. శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది.