ఆ వయసులో Sr NTR ని లక్ష్మీపార్వతి పెళ్లి చేసుకుందే ఆ కోరిక కోసం..!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు చిత్రంతో కూడిన రూ. 100 నాణేన్ని ఈ నెల 28న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆయన పేరుతో రూ. 100 నాణేన్ని ముద్రించింది. అయితే సీనియ‌ర్ సినీ ఎన‌లిస్ట్‌ ఇమంది రామారావు తాజా ఇంట‌ర్వ్యూలో సీనియర్ ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. సీనియర్ ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోకుండా ఉండి ఉంటే ఆయన జీవితం అద్భుతంగా ఉండేదని వివరించాడు.

సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తుతం ఉన్న మీడియాలో అనేక రకాల కథనాలను అల్లేసుకొని న్యూస్ వైరల్ చేయడానికి చూస్తున్నారని. ఎన్టీఆర్ గారు బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి అని రామారావు పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ మొదటి భార్య, పిల్లలను కూడా చంటి పిల్లల లాగా చూసుకునే వారిని చెప్పాడు. రామారావు గారికి తెలుగు భాష పై ఉన్న అభిమానం ప్రశంసనీయమని ఆయ‌న తెలిపారు. ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతి బాధలు విన్న తర్వాత మనసు కరిగి ఆమెకు కూడా తోడు కావాలనే ఉద్దేశంతోనే లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడని వివరించాడు.

లక్ష్మి పార్వతి.. ఎన్టీఆర్‌తో ఆమెలాంటి మహిళ తన జీవితంలో కూడా ఉంటే బాగుంటుంది అనే విధంగా ప్రవర్తించేదని.. సైకలాజికల్ గా లక్ష్మీపార్వతి ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పించిందంటూ వివరించాడు. సీనియర్ ఎన్టీఆర్ మొండి వార‌ని అనుకున్నది కచ్చితంగా సాధించే తీరుతాడు.. ఆయన మాటకు పిల్లలు కూడా ఎదురు చెప్పలేరంటూ రామారావు చెప్పుకొచ్చారు. అప్పటికి త్రివిక్రమరావు అనారోగ్యం పాలయ్యారని ఆయన ఆరోగ్యంగా ఉండి ఉంటే లక్ష్మీ పార్వతి ఆటలు సాగేవి కాదని ఆమె ఆటలు కట్టిపెట్టేవాడని రామారావు చెప్పారు. త్రివిక్రమరావు హీరోయిన్ కృష్ణకుమారికే చుక్కలు చూపించాడు అంటూ కామెంట్ చేసాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *