స్పెర్మ్ కణాల ఉత్పత్తిలో జింక్ భారీ పాత్ర పోషిస్తుంది. బార్లీ, బీన్స్ మరియు ఎర్ర మాంసం వంటి ఆహారాలు జింక్‌లో పుష్కలంగా ఉంటాయి మరియు వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి మీ ఆహారంలో చేర్చాలి. జింక్ లోపం వల్ల స్పెర్మ్ చలనశీలత తగ్గుతుంది, సంతానోత్పత్తి తగ్గుతుంది. అయితే పెళ్లయిన తర్వాత ప్రతి మగాడు తండ్రి కావాలని కోరుకుంటాడు. కానీ కొన్నిసార్లు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీర్య కణాలు తక్కువగా ఉత్పత్తి అవ్వడం.
మారిన జీవన శైలి.. ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం యువకుల్లో వీర్య కణాల ఉత్పత్తి తక్కువగా ఉంటోంది. ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని అజాగ్రత్త చేస్తున్నారు. వీర్య కణాల ఉత్పత్తిని సహజంగా పెంచే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేపలు.. చేపలు వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చేపలలో పుష్కలంగా ఉంటాయి. ఇది పురుషుల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. చేపలు తినడం వల్ల పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తి పెరుగుతుంది.
పండ్లు, కూరగాయలు.. పురుషులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి తాజా పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. ఇవి స్పెర్మ్ కౌంట్ ను పెంచుతాయి. వాల్‌నట్స్.. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి వాల్‌నట్‌లను ఉత్తమ డ్రై ఫ్రూట్స్‌లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే వాల్‌నట్స్ సహాయంతో స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. అందుకే మగవారు దీన్ని తప్పనిసరిగా డైలీ డైట్‌లో చేర్చుకోవాలి.