జుట్టును ఎలా బలోపేతం చేసుకోవాలో అర్థంగాక మదన పడిపోతూ ఉంటారు. కొందరు ఈ సమస్యకు పరిష్కారం కోసం హాస్పటల్స్ చుట్టూ తిరుగుతూ రకరకాల మందులను వాడుతుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఒకే ఒక్క చిట్కాతో జుట్టును బలోపేతం చేసుకోవచ్చు. ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను మెత్తగా పేస్ట్ చేసి జ్యూస్‌ను వేరు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ రసం, ఒక గుడ్డు పచ్చ సొన, మూడు టేబుల్ స్పూన్ల పచ్చి పాలు, ఒక స్పూన్ ఆముదం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.
గంట అనంతరం మైల్డ్ షాంపూను యూజ్ చేసి గోరు వెచ్చని నీటితో తల స్నానం చేయాలి.నాలుగు రోజులకు ఒక సారి ఇలా చేస్తే జుట్టు బలంగా, దృఢంగా మారుతుంది. అదే సమయంలో హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్, స్ప్లిట్ హెయిర్ వంటి సమస్యల నుంచి సైతం విముక్తి లభిస్తుంది.