ఇక్కడి తాంత్రికులు జీవాత్మలకు, ప్రేతాత్మలకు మధ్య వారధిగా ఉంటారు. ఇటు చనిపోయిన వారి చేయిపట్టుకొని, అటు బతికిన వారి చేయిపట్టుకొని.. దుబాసీలా ఒకరి సంభాషణను మరొకరికి చేరవేస్తారు. ఈ విధానాన్ని ‘మీడియంషిప్’ అంటారు. ఈ పద్ధతిలో పెంపుడు జంతువులు, దేవదూతల నుంచి సమాచారాన్ని తీసుకొస్తారు. ఆ సందేశాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియజేస్తారు.
అయితే హఠాత్తుగా ఆత్మీయులను కోల్పోయారా? తీరని కోరికలతో రగిలిపోతున్న ప్రేతాత్మలను శాంతింపజేయాలని అనుకుంటున్నారా? అయితే, న్యూయార్క్‌లోని కసాడగా సరస్సు పక్కనే ఉన్న ‘లిల్లీ డేల్’కు వెళ్లండి. మీ సమస్యను చెప్పండి. ప్రియమైన ప్రేతాత్మలతో కాసేపు ముచ్చటించండి. వారి ఆశలు తెలుసుకోండి.
తీరని కోరికలేమైనా ఉంటే తీర్చండి. ఆ ఆత్మకు శాంతి కలిగించండి. మనుషులే కానక్కర్లేదు. ప్రియమైన పెంపుడు జంతువుల ఆత్మలతోనూ మాట్లాడవచ్చు. ‘ఇదంతా ఉత్త ముచ్చటే. ఈ కాలంలో కూడా ప్రేతాత్మలు ఎక్కడున్నయ్?’ అని దీర్ఘాలు తీయకండి. అక్కడికి వెళ్లిన ఎంతోమంది వితండవాదులు, ఆత్మలతో మాట్లాడారు. దయ్యాలున్నాయని అంగీకరించారు.