బిగ్ బాస్ 7వ సీజన్ లో శోభా శెట్టి జర్నీ ముగిసింది. నిన్న డేంజర్ జోన్ లోకి శివాజీ, శోభా శెట్టి వచ్చారు.. వీరిలో శోభ ఎలిమినేషన్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో 14వ వారంలో శోభా శెట్టి ఎలిమినేషన్ అయి బయటికి వెళ్లిపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ మరో వారం రోజుల్లో షో ముగుస్తుంది. కార్తీక దీపం సీరియల్ లో దీప, కార్తీక్ పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉందో.. విలన్ గా నటించిన మోనిత కూడా అంతే క్రేజ్ దక్కించుకుంది.
Pov : public reaction after Shobha Shetty elimination #biggboss7telugu #ShobhaShetty pic.twitter.com/lLZvyWnlnA
— relatable telugu (@relatabletelugu) December 10, 2023
ఈ సీరియలో కార్తీక్ ని దక్కించుకునేందుకు ఎన్నో రకాలు పన్నాగాలు పన్నుతుంది.. మొత్తానికి బుల్లితెరపై మోనితగా శోభా శెట్టి విలనీజం, హావభావాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. దీంతో ఆ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 7 లో చోటు దక్కించుకుంది. మోనితగా కాదు.. శోభా శెట్టి అంటే ఏంటో బిగ్ బాస్ లో చూపిస్తా అంటూ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి నుంచి సీరియల్ బ్యాచ్ అయిన అమర్, ప్రియంక, శోభా శెట్టి ముగ్గురూ ఒకేతాటిపై నడిచారు.
నామినేషన్ల సమయంలోనే కాదు.. మాములూగా కూడా ఎదటి వారిపై మాటల దాడి చేస్తూ.. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు శోభా శెట్టి ఫైర్ బ్రాండ్ గా కొనసాగింది. కొన్ని సందర్బాల్లో తీవ్ర విమర్శల పాలైంది.. వీక్ ఎండ్ లో నాగార్జున వచ్చి క్లాస్ తీసుకునేవారు. ప్రతిసారి నామినేషన్ లీస్ట్ లో ఉన్నప్పటికీ.. ఎలిమినేట్ కాకుండా లక్కీగా సేవ్ అయ్యేది. మొత్తానికి 14 వారాల పాటు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న శోభా శెట్టి నిన్న ఎలిమినేషన్ అయ్యింది.తాజాగా శోభా శెట్టికి సంబంధించిన ఓ వీడియో లో నెట్టింట వైరల్ అవుతుంది.