శివాజీ భార్య ని ఎప్పుడైనా చూసారా..? ఆమె బ్యాగ్రౌండ్ చూస్తే మతిపోతుంది.

శివాజీ తన వ్యక్తిగత విషయాలను పంచుకోడానికి అసలు ఇష్టపడడు. ఇప్పటి వరకు ఆయన తన భార్య పిల్లల ఫోటోలను బయటకి లీక్ కాకుండా చూడడమే అందుకు నిదర్శనం. కానీ మాకు తెలిసిన కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా శివాజీ భార్య పిల్లల గురించి మీకెవ్వరికీ తెలియని కొన్ని విషయాలను తెలియచెయ్యబోతున్నాము. అయితే అసలు శివాజీ పెళ్లి చేసుకున్న అమ్మాయి తన చెల్లెలు కాదు. తనకు వరుసకు చెల్లెలు అస్సలు కాదు. శివాజీకి రెండు పెళ్లిళ్లు అయ్యాయి అనేది కూడా అబద్ధం. అసలు తన భార్య తన బంధువే కాదు.

వాళ్ల క్యాస్ట్ కూడా కాదు. శివాజీది ఏపీలోని గుంటూరు జిల్లా అని తెలుసు కదా. తన భార్య పేరు శ్వేత. తనది తెలంగాణలోని నిజామాబాద్. తను గౌడ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఆమె ఎవరో కాదు.. నిజామాబాద్ మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ తోడల్లుడి కూతురు. శివాజీ చౌదరి అని అందరికీ తెలుసు. ఆమె గౌడ్స్. ఇక.. ఆమె వరుసకు చెల్లెలు ఎలా అవుతుంది. అందులోనూ వీళ్లది లవ్ మ్యారేజీ కూడా కాదు. అంటే లవ్ కమ్ అరేంజ్ అని చెప్పుకోవచ్చు. తనను ఓ ఫంక్షన్ లో చూసి శివాజీ ఇష్టపడ్డాడు.

ఇద్దరూ మాట్లాడుకున్నరు. ఇష్టపడ్డారు. ఆ తర్వాత ఇరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తన భార్య శ్వేతకు షూటింగ్ అంటే తెలియదని.. తనకు సినిమాల గురించి కూడా ఎక్కువగా పరిచయం లేదని చెప్పాడు శివాజీ. శివాజీ ఉన్నతమైన భావాలు ఉన్న వ్యక్తి కావడం వల్ల రూపాయి కట్నం తీసుకోకుండా శ్వేతను పెళ్లి చేసుకున్నాడు. తను సెలబ్రిటీ అయినా కూడా చాలా సామాన్య వ్యక్తిగా జీవిస్తుంటాడు శివాజీ. ఇక.. తనపై ఇలా చెల్లెలును లేపుకెళ్లి పెళ్లి చేసుకున్నడు అనే పుకార్లు పుట్టించింది రాజకీయ నాయకులే.

అప్పట్లో శివాజీ కొన్ని రోజులు బీజేపీలో ఉండి ఆ తర్వాత బీజేపీ నుంచి బయటికి వచ్చి టీడీపీకి వీరాభిమాని అయ్యాడు. అప్పుడు వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. అప్పుడు వైసీపీ నాయకులు ఇలా శివాజీని ఇరికించేందుకు తన పెళ్లిని పావుగా వాడుకున్నారు. ఆ తర్వాత అవన్నీ ఉత్త పుకార్లే అని శివాజీ కుండ బద్ధలు కొట్టడంతో ఆ ఇష్యూ అక్కడితో ముగిసిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *