దేవిశ్రీ ప్రసాద్‌ ఇంట శుభవార్త, తండ్రైన స్టార్ సింగర్‌.

తాజాగా సాగర్ ఆయన సతిమణి మౌనిక తల్లిదండ్రులు అయ్యారు. కాగా, సాగర్ 2019లోని ప్రముఖ డాక్టర్ అయిన మౌనికను పెళ్లి చేసుకున్నారు. కాగా, మౌనిక ఈనెల అనగా ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు, సింగర్ సాగర్ తండ్రిగా ప్రమోషన్ పొందాడు.

అన్న సంగీత దర్శకత్వంలో ఎన్నో పాటలు పాడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాగర్‌. ఈయన 2019లో డాక్టర్ మౌనికను పెళ్లాడాడు. కొద్ది నెలల క్రితం మౌనిక గర్భం దాల్చగా తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 21న ఆమె డెలివరీ అయినట్లు తెలుస్తోంది. సాగర్ దంపతులకు సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక ఇది చూసిన అభిమానులు దేవిశ్రీప్రసాద్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదని బాధపడుతున్నారు. త్వరలో దేవిశ్రీప్రసాద్ పెళ్లి అంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. కానీ ఏదీ కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న డీఎస్పీ ఈ ఏడాదైనా పెళ్లి చేసుకుంటాడేమో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *