సింగర్ సునిత జీవితం విషయానికి వస్తే 19 సంవత్సరాల వయసులోనే కిరణ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు. అబ్బాయి ఆకాశ్, అమ్మాయి శ్రేయ. పిల్లలు పుట్టిన తరువాత కిరిణ్ కుమార్ చేసే వికృత చేష్టలకు విసిగిపోయి 2011లో విడాకులు తీసుకుంది. సునిత భర్త కిరణ్ ఆమెపై అనుమానం పెంచుకున్నాడని, ఆ కారణంతోనే తరుచూ వేధిస్తుండేవాడు. సింగర్ సునిత తన కెరీర్, పిల్లల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి కిరణ్ కుమార్ ఏమయ్యాడు, ఎక్కడ ఉన్నాడు.
అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. విడాకుల తీసుకొని దాదాపు 11 సంవత్సరాలు అవుతోంది. ఈ దంపతులకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా పెద్దవారు అయ్యారు. కూతురు శ్రీయ చదువుకుంటూనే.. అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి సినిమాలో ఓ పాటను అద్భుతంగా పాడింది. అంతేకాదు మంచి మనసు ఉన్న మనిషిగా కూడా శ్రీయ పేరు తెచ్చుకుంది. వీరి కొడుకు ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి చదువులు చదువుతున్నాడు.
పిల్లలిద్దరికీ తల్లి సునిత అంటే ఎంత ప్రేమో తండ్రి కిరణ్ అంటే కూడా అంతే ప్రేమ. ఇటీవలే సోషల్ మీడియాలో కిరణ్ కుమార్ ఫోటోలను చూసి వారు షాక్‌కు గురయ్యారు. ఆయనను గుర్తు పట్టడం కూడా కష్టంగా మారింది. కిరణ్ కుమార్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. కొన్ని టీవీ ప్రోగ్రామ్‌లలో పని చేస్తూ.. అవార్డు ఫంక్షన్స్‌కి డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. సునిత పిల్లలు చిన్నప్పుడు తండ్రితో దిగన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.