శ్రియా శరణ్ కూతురు ఎంత ముద్దుగా ఉందో చూడండి.

శ్రియ కూతురిని ఇంటికి వెళదామని ఎంత బ్రతిమిలాడినా రావడం లేదు. అందరూ వెళ్లిపోయారు. మనం మాత్రమే ఉన్నాం, ఇంటికి వెళదాం అంటూ శ్రియ కూతురు రాధను బ్రతిమిలాడుతుంది. శ్రియ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కూతురు ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ని అభిమానులతో శ్రియ పంచుకున్నారు. అయితే మోడల్ గా కెరీర్ మొదలు పెట్టిన శ్రియ 2001లో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

నాగార్జునతో కలసి నటించిన సంతోషం మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత టాప్ హీరోలతో నటిస్తూ వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. 2018లో ఆండ్రీని ప్రేమ వివాహం చేసుకుంది శ్రియ. లాక్ డౌన్ సమయంలో పాపకు జన్మనిచ్చిన శ్రియ.. తాను తల్లైన తర్వాత ఆ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పటికీ ఆఫర్స్ అందుకుంటూ కెరీర్లో ముందుకెళుతోంది..మరోవైపు కుటుంబంతో మంచి టైమ్ స్పెండ్ చేస్తోంది.

భర్త, కూతురితో కలసి వెకేషన్లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోస్ షేర్ చేసింది శ్రియ. పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్ కి పంపడం ఎమోషనల్ మూమెంట్. ఆ క్షణాన్ని హీరోయిన్ శ్రీయ సైతం అనుభవిస్తున్నారు. కూతురు రాధను స్కూల్ లో అడ్మిట్ చేశారు. శ్రియ భర్తతో కలిసి స్కూల్ కి వెళ్లారు. ఇక రాధ స్కూల్ అయిపోయాక కూడా ఇంటికి రావడం లేదట. స్కూల్ ఆవరణలో ఉన్న ప్లే జోన్ లో ఆటల్లో మునిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *