తాజాగా బెయిల్‌పై షణ్ముఖ్ జశ్వంత్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని లాయర్ కల్యాణ్ దిలీప్ సుంకర తన్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఆ ఫొటోలో కేవలం షణ్ముఖ్ మాత్రమే ఉన్నాడు. అతని సోదరుడు సంపత్ వినయ్ కనిపించలేదు. అయితే షణ్ముఖ్ జస్వంత్‌తో పాటు అతడి సోదరుడు వినయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఈ అంశం సెన్సేషన్ అయిపోయింది.
దీంతో పోలీసులు విషయాలను వెల్లడించకున్నా.. ఎన్నో రకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. దీంతో మీడియాలో షణ్ముఖ్ గురించి, అతడి సోదరుడి గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ అంశం హాట్ టాపిక్ అవుతోంది. సంపత్ వినయ్, షణ్ముఖ్ జస్వంత్‌ను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసు అధికారులు మీడియాతో ‘ఓ కేసు విచారణలో భాగంగా సంపత్ కోసం వచ్చాము.
అక్కడ సోదాలు చేస్తున్నప్పుడు గంజాయి దొరికింది. దీంతో సంపత్, షణ్ముఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారణం చేస్తున్నాము. వీళ్లకు గంజాయి సప్లై చేసిన వాళ్ల కోసం గాలిస్తాం’ అని వివరించారు.