“పులి కడుపున పులే పుడుతుంది. నేను వైఎస్సార్ రక్తం. ఎవరు అవునన్నా, కాదన్నా నేను వైఎస్ షర్మిలా రెడ్డి. YSRను అభిమానించే వాళ్ళు ఆయన ఆశయాలను కూడా కాపాడాలి” అని షర్మిల కోరారు. “విమర్శ చేయడం నా ఉద్దేశ్యం కాదు. YSR పాలనకూ, జగన్ ఆన్న గారి పాలనకూ చాలా వ్యత్యాసం ఉంది. YSR జలయజ్ఞంపై ఎంతో దృష్టి పెట్టారు. వైఎస్సార్ కాలంలో బడ్జెట్లో దాదాపు 15 శాతం నిధులు జలయజ్ఞానికి కేటాయించారు. అందుకే ఆనాడు ప్రాజెక్టులు నిజ రూపం దాల్చాయి.
అయితే నేను నమ్మే దేవుడి మీద, నా బిడ్డ మీద ప్రమాణం చేస్తా’ అని షర్మిల పేర్కొన్నారు. ‘ఎవరో నాకు కితాబ్ ఇస్తేనే నా విలువ పెరుగుతుందా.. ఎవరు నాకు కితాబ్ ఇవ్వకపోతే నా విలువ తగ్గుతుందా’ అని ప్రశ్నించారు. ‘నేను వైఎస్సార్ రక్తం. మా నాన్న రెడ్డి అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుంది’ అని ప్రశ్నించారు. నా కొడుకు రాజారెడ్డి కి ఆపేరు పెట్టింది రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేశారు. ‘నిజం ఎప్పుడు నిలకడగా నిలుస్తుంది. వైఎస్సార్ ఆశయాల కోసమే నేను కాంగ్రెస్‌లో చేరాను’ అని తెలిపారు.
‘నా దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. నా పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. భారతమ్మ చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట. నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానట’ అని షర్మిల అసహనం వ్యక్తం చేశారు. ‘దమ్ముంటే అప్పటి జైలు అధికారి తో ఈ విషయం చెప్పించగలరా? దేవుడు మీద ప్రమాణం చేయగలరా ? ఆ రోజు ఏం జరిగిందో నేను ప్రమాణం చేసి చెప్పగలను’ అని సవాల్ విసిరారు.