రాజస్థాన్ లోని జోధ్‌పూర్ ప్యాలెస్ లో రాజారెడ్డి-ప్రియ జంట వివాహ వేడుకలు మూడు రోజులపాటు జరిగాయి. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారమే ఈ పెళ్లి జరిగినట్లు వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పెట్టిన వీడియోను బట్టి తెలుస్తోంది. అయితే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెండ్లి ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో కొద్దిమంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. ఫిబ్రవరి 17వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ప్యాలెస్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి జరిగింది.
ఫిబ్రవరి 18న ఉదయం క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో మరోసారి రాజారెడ్డి, ప్రియ వివాహం జరిగింది. ఈ విషయాన్ని షర్మిల సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ ఫొటోలను షేర్ చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన సంగీత్, మెహందీ వేడుకలు జరిగాయి. అంగరంగ వైభవంగా వైఎస్ షర్మిల కొడుకు పెళ్లి.. పిక్స్ వైరల్