పోలీసులు వేరే కేసు విషయంలో షణ్ముఖ్ సోదరుడి ఇంటికి వెళితే.. అక్కడ గంజాయి దొరికిందని.. ఆ సమయంలో షణ్ముఖ్ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి. గంజాయి కేసులో షణ్ముఖ్, అతని తమ్ముడు సంపత్ పట్టుబడగా, విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు తెలుస్తోంది.
వారిపై మౌనిక అనే యువతి ఫిర్యాదు చేశారు. తనకు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి షణ్ముఖ్ సోదరుడు మోసం చేశాడట. షణ్ముఖ్ సోదరుడు సంపత్ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి బెదిరించి లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఓసారి అబార్షన్ కూడా చేయించాడట సంపత్. అతనికి పెళ్లి అయిందని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మౌనిక తెలిపారు.
యూట్యూబ్‌లో రాత్రికి రాత్రే స్టార్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ వరుసగా ఇలా కేసుల్లో చిక్కుకుంటూన్నాడు. షణ్ముఖ్ జస్వంత్ కు అటు సోషల్ మీడియాలో కూడా చక్కటి ప్రజాదరణ ఉంది. వెబ్ సిరీస్ లలో ఎంతో సున్నితంగా కనిపించే షణ్ముఖ్ రియల్ లైఫ్ లో మాత్రం బ్యాడ్ బాయ్ అనే పేరు తెచ్చుకుంటున్నాడు.