రెబల్ స్టార్ కృష్ణం రాజు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ ధృవతార. తనదైన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా బిరుదు పొందారు. ఇలా చిత్ర పరిశ్రమలోనే కాక రాజకీయాల్లో కూడా ఆయన ఎంట్రీ ఇచ్చారు. రాజు గారికి రాజకీయ రంగం తో చాలా సనిహిత సంబందం ఉంది. గతంలో ఎంపీగా పోటీ చేసి కృష్ణం రాజు గెలుపొందారు. అయితే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో పోటీ కోసం మరొకసారి వైసిపి అగ్రనాయకత్వం రఘురామ కృష్ణంరాజుకు టికెట్ ఇవ్వాలని అనుకోవట్లేదు.
ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచే రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్న రఘురామకు బదులుగా నర్సాపురం లోకసభలో కొత్త నాయకత్వం కోసం అన్వేషిస్తున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఆ ప్రయత్నాలు ఫలించినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి గారిని రంగంలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఆమెతో వైఎస్ఆర్సిపి సంప్రదింపులు సాగుతున్నట్లు.
ఉమ్మడి గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సిపి బాధ్యతలను పర్యవేక్షిస్తున్న లోక్సభ సభ్యుడు ఇప్పటికే ఈ సంకేతాలను కూడా పంపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శ్యామలాదేవి దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది…కానీ మునుముందు ఆమె తన ప్రతిపాదనలను అంగీకరిస్తారని వైసీపీ ఆశిస్తోంది. ఇకపోతే నర్సాపురం లోక్ సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటు బ్యాంకు కావడం మరొకవైపు రఘురామ కృష్ణంరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడే కావడంతో అక్కడ కొత్త వివాదం నెలకొంది.