నగల యాడ్‌ కోసం సితార పారితోషికం తెలిస్తే ఫ్యూజులు ఔట్‌. ఎంతంటే..?

తన ఫ్రెండ్స్‌తో కలిసి చేసే అల్లరిని, మహేష్ ఫ్యామిలీ ముచ్చట్లను, పండగ సెలబ్రేషన్స్ తాలూకు విషయాలు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటుంది. దీంతో సితార ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. ఈ మధ్యకాలంలో అయితే తన లుక్స్ తో సితార అట్రాక్ట్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. అయితే మహేష్‌బాబు కూతురు సితార సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతుంది. డాన్సులతో అదరగొడుతుంది.

అవన్నీ కాదని లేటెస్ట్ గా ఏకంగా అమెరికాలోని టైమ్స్ స్వ్కైర్‌పైకి ఎక్కింది. ఆమె నటించిన జ్యూవెల్లరీ యాడ్‌ని టైమ్స్ స్క్వైర్‌పై ప్రదర్శించారు. చిన్న వయసులో అంతటి అరుదైన ఘనత సాధించిన స్టార్‌ కిడ్‌గా సితార రికార్డ్ సృష్టించింది. దీనిపై మహేష్‌ సైతం ఉబ్బితబ్బిబ్బయ్యారు. గర్వంగా ఉందని, ఇలానే దూసుకువెళ్లాలని తెలిపారు. మరోవైపు సితార సైతం స్పందిస్తూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. తనని తాను టైమ్స్ స్వ్కైర్‌పై చూసుకుని ఎమోషనల్‌ అయినట్టు తెలిపింది.

తనకిది బెస్ట్ మెమరీ అని పేర్కొంది. తల్లి నమ్రత ఆనందానికి కూడా అవదుల్లేవ్‌. ఇక ఈ యాడ్‌ కోసం సితార తీసుకున్న పారితోషికం ఇప్పుడు మరో సంచలనం సృష్టించింది. అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అంతేకాదు ఆ వివరాలు తెలిస్తే మాత్రం ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఈ జ్యూవెల్లరీ యాడ్‌ కోసం సితార ఏకంగా రూ.కోటి తీసుకున్నారట. ఇది నమ్మడానికి షాకింగ్‌గా ఉన్నా ఇదే నిజమని తెలుస్తుంది. అంతటి మొత్తం కావడం వల్లే మహేష్‌.. సితార ఈ యాడ్‌ చేయడానికి ఒప్పుకున్నాడని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *