జగన్ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ నేతలకు..ప్రజలకు అందుబాటులో లేకపోవటం పార్టీ శ్రేణులకే నచ్చలేదు. ఓటమికి ఇది కూడా కారణంగా విశ్లేషణలు ఉన్నాయి. సీఎంగా పార్టీ ఎమ్మెల్యేలను కలిసే అవకాశం దక్కలేదనే విమర్శలు వినిపించాయి.
దీంతో, జగన్ తన వైఖరి మార్చుకుంటున్నారు. తాను మారుతున్నాననే సంకేతాలు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.జగన్ ఇక నుంచి పార్టీ నేతలు..కేడర్ తో పాటుగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. ఇందు కోసం ఈ నెల 15వ తేదీ నుంచి తాడేపల్లి తన నివాసంలోనే ప్రజాదర్బార్ కు సిద్దం అవుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ప్రజలు వచ్చి కలవటానికి వీలుగా గ్రిల్ నిర్మాణం పూర్తి చేసారు. కానీ, జగన్ అనేక సార్లు ప్రజాదర్బార్ నిర్వహిస్తారనే ప్రచారం సాగినా..నిర్వహించలేదు. ప్రజలతో మమేకం కావటం పైన సొంత పార్టీలోనే జగన్ పైన విమర్శలు వచ్చాయి.