రామ్ చరణ్, ఉపాసన కూతురికి సెక్యూరిటీ ఎలా ఉందొ తెలుసా..? ఉపాసన ఏం చెప్పిందంటే..?

ఉపాసన.. చరణ్ దంపతులకు కూతురు పుట్టడంతో మెగా ఫ్యామిలీతోపాటు మెగా అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. వారసురాలి రాకతో మెగా కుటుంబంలో సంబరాలు నెలకొన్నాయి. అంతేకాకుండా.. చిరు ఫ్యామిలీకి ఇష్టమైన మంగళవారమే పాప జన్మించడంతో చిరంజీవి కుటుంబం సంతోషంలో మునిగిపోతున్నారు. అయితే క్లీంకారకి రామ్‌చరణ్‌ దంపతులు ఫుల్‌ సెక్యూరిటీ పెట్టారు. రాత్రి సమయాల్లో కూడా తన కూతురుని కంటికి రెప్పలా చూసుకునేలా ఏర్పాట్లు చేశారు. క్లీంకార బిగ్ బ్రదర్ ఇప్పుడు క్లీంకార సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యం రాత్రిళ్లు కంటికి రెప్పాలా కాపాడుకుంటున్నాడు.

చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని రామ్‌చరణ్‌ దంపతులు తెలిపారు. వీరికి రైమ్‌ అనే చిన్న పెంపుడు కుక్క ఉన్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా దీన్ని పెంచుకుంటున్నారు రామ్‌చరణ్‌ దంపతులు. తమ పెద్ద కొడుకుగా భావిస్తున్నారు. అయితే ఇప్పుడు రైమ్‌కి పెద్ద బాధ్యతలు అప్పగించారు. చిన్నారి క్లీంకారని రాత్రిళ్లు చూసుకునే బాధ్యతలు అప్పగించారట. రాత్రి సమయంలో సోఫాపై నిల్చొని క్లీంకార పడుకున్న కాట్‌ని చూస్తుంది రైమ్‌. దీన్ని ఫోటో తీసి ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

ఇందులో పేర్కొంటూ, నా చెల్లెలు నైట్‌ డూటీపై ఓ కన్ను వేచి ఉన్నాను అని క్యాప్షన్‌ పెట్టారు. రైమ్‌ తన భావాలను చెబుతున్నట్టుగా ఈ ఇన్‌స్టాగ్రామ్‌ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దాన్నే కంటిన్యూ చేస్తున్నారు. చాలా ఫన్నీగా మార్చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక రామ్‌చరణ్‌ ప్రస్తుతం గేమ్‌ చేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.ప్రస్తుతం అన్నపూర్ణ సెవెన్‌ ఎకర్స్ లో జరుగుతుంది. విలన్‌ ఎస్‌ జే సూర్యల మధ్య ఫైట్‌ సీక్వెన్స్ తీస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *