రాజారెడ్డి – ప్రియ ఎంగేజ్ మెంట్ హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న గోల్కొండ రిసార్ట్స్ లో జరగనుంది. ఈ ఎంగేజ్ మెంట్ కు సీఎం జగన్ హాజరవుతారని సమాచారం. వైఎస్సార్ కుటుంబ సభ్యులతో పాటుగా రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ తో పాటుగా తెలుగుదేశం అధినేత చంద్రబాబును షర్మిల ఆహ్వానించారు.
అయితే వైఎస్ షర్మిల కుమారుడు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 17న రాజారెడ్డి – అట్లూరి ప్రియ వివాహం జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ ఈ నె 18న హైదరాబాద్ లో నిర్వహించాలని నిర్ణయించారు. ఇందు కోసం నిశ్చితార్ధంతో పాటుగా వివాహం, ఆ తరువాత హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిపిప్షెన్ ఆహ్వానాలను ఇప్పటికే షర్మిల పలువురు ప్రముఖులకు అందించారు. హాజరు కావాలని ఆహ్వానించారు.
తన అన్న సీఎం జగన్ ను కలిసి రావాలని కోరారు. ఇందుకు జగన్ అంగీకరించినట్లు స్వయంగా షర్మిల వెల్లడించారు. ఇప్పుడు ఎంగేజ్ మెంట్, వివాహం అనంతరం నిర్వహించే రిసిప్షెన్ ఆహ్వాన పత్రికలు వైరల్ అవుతున్నాయి.