రాష్ట్ర విభజన తర్వాత ఏపీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు, క్యాడర్ వైసీపీలో చేరారు. సీనియర్ నేతలు జగన్ వెంటనడిచారు. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ పరిస్థితులు మారాయి. ఎన్నికల ముందు వైసీపీలో అసంతృప్తి బయటపడుతోంది. ఈ తరుణంలో షర్మిల ఏపీ రాజకీయాల్లో రాబోతున్నారన్న వార్తలు వస్తుడడంతో…ఆమె వెంట నడిచేందుకు పలువురు నేతలు సిద్ధమయ్యారు.
ఇప్పటికే వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణమంటూ ప్రకటించారు. ఏపీ కాంగ్రెస్ నేతలు సైతం షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తే… చేరికలు పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు, మాజీలు, ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరితే వైసీపీలో కాంగ్రెస్ వాదులు తిరిగి సొంత గూటికి చేరతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.