ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ శనివారం ఓ అంబులెన్స్‌కు దారి ఇచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ రోడ్డులో చోటు చేసుకుంది. మధ్యాహ్నం 11.45 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబీఆర్ పార్క్ రోడ్డు మీదుగా వెళ్తున్నారు. ఆ సమయంలో అంబులెన్స్ రావడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ దారి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పెద్దమనసు చాటుకున్నారు. తాను వెళుతున్న దారిలో వస్తున్న అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ఉదయం 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో KBR పార్క్ రోడ్డులో ఈ దృశ్యం కనిపించింది. తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని, CMగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి ట్రాఫిక్ అధికారులకు సూచించారు. ఇప్పటికే ట్రాఫిక్‌లో జనానికి ఇబ్బందులు లేకుండా సీఎం చొరవ తీసుకుంటున్నారు.
ఈ మేరకు సాధారణ ట్రాఫిక్ లోనే సీఎం కాన్వాయ్ పయనిస్తోంది. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తుండగా.. అంబులెన్స్ అటుగా వస్తుండటంతో ఆయన తన కాన్వాయ్ ను పక్కకు జరపమని చెప్పి అంబులెన్స్‌కు దారి ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.