విషాదం. ప్రముఖ తెలుగు యాంకర్ కన్నుమూత, కుప్పకూలిన సుమ, ప్రదీప్.

శాంతిస్వరూప్ ..80,90వ దశకాల్లో ఆయన గొంతు తెలియని తెలుగు ప్రజలు లేరంటే అతిశయోక్తి కాదు. డీడీ తెలుగు ప్రసారాలు ప్రారంభమైన తర్వాత న్యూస్‌ రీడర్‌గా కెరీర్ సాగింది. పదవీ విరమణ చేసే వరకు ఆయన డీడీలో అదే వృత్తిలో కొనసాగారు. 2011లో పదవీ విరమణ చేశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న శాంతి స్వరూప్‌ హైద‌రాబాద్ య‌శోదా ఆస్ప‌త్రి yashoda Hospitalలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన‌ట్లు ఆయ‌న కుటుంబ స‌భ్యులు తెలిపారు.

రెండు రోజుల క్రితం శాంతిస్వ‌రూప్ గుండెపోటుతో యశోదా ఆస్ప‌త్రిలో చేరారని ఆయన కుమారుడు తెలిపారు. శాంతిస్వ‌రూప్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజ‌కీయ ప్ర‌ముఖులు, జ‌ర్న‌లిస్టులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. 1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శ‌న్ చానెల్‌లో శాంతి స్వ‌రూప్ తెలుగులో తొలిసారి వార్త‌లు చ‌దివారు. అప్పట్లో వార్తలు చదవడానికి ఇప్పటి మాదిరి న్యూస్‌ ప్రాంప్టర్‌ సౌకర్యం ఉండేది కాదు.

ప‌దేళ్లకు పైగా టెలీప్రాంప్ట‌ర్ సదుపాయం లేకుండానే కేవలం పేప‌ర్లపై రాసిచ్చిన వార్తల్ని చూసి ఆయన ప్రజలకు వినిపించే వారు. తడబాటు లేకుండా స్పష్టమైన ఉచ్చరణతో ఎప్పుడు విన్నా టక్కున గుర్తు పట్టే స్వరంతో తెలుగు ప్రజలకు ఆయన చేరువ అయ్యారు. రేడియోల శకం ముగిసి, టీవీ వార్తలు మొదలయ్యాక దూరదర్శన్‌లో మొదట్లో సాయంత్రం పూట మాత్రమే వార్తలు ప్రసారం అయ్యేవి. న్యూస్‌ రీడర్‌గా ప్రేక్షకులకు శాంతి స్వరూప్ అనతి కాలంలోనే చేరువ అయ్యారు.

2011లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వ‌ర‌కు శాంతి స్వ‌రూప్ వార్త‌లు చ‌దివారు.ఆయన న్యూస్‌ రీడర్‌గా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా ఆయ‌న అందుకున్నారు. శాంతిస్వ‌రూప్‌కు భార్య‌, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. కుమారుడు సాప్ట్ వేర్ ఉద్యోగి గా పనిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *