సన్నీ లియోన్ నీలి చిత్రాలకు స్వస్తి చెప్పి బాలీవుడ్ సినిమా దర్శకురాలు, నిర్మాత అయిన పూజాభట్ నిర్మించిన జిస్మ్ 2 లో ప్రధాన ప్రాత పోషించింది. రాగిణి MMS 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ అనే తెలుగు చిత్రంలో ఈమె నటించింది. ఏక పహేలీ లీల, కుచ్ కుచ్ లోచా హై వంటి హిందీ సినిమాలు నటించింది. అయితే ఈ మధ్య కాలంలో సన్నీ లియోనీ పేరు ట్రెండింగ్‌లో ఉంటోంది. పలు ఇంటర్వ్యూలు ఇస్తుండటమే దీనికి ప‍్రధాన కారణం. ఓ ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.
ఆమె మద్యానికి బానిస అయిందనే విషయాన్ని బయటపెట్టింది. అడల్ట్ వీడియోస్ వల్ల ‘మా అమ్మకు మందు తాగే అలవాటు ఉండేది. అయితే నేను పో*ర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కువగా మద్యం తాగేది. అలా దానికి బానిస అయిపోయిందని అనుకుంటున్నా. నేను ఇలాంటి వీడియోల చేయడం ఇష్టం లేకపోవడం వల్లే మందు తాగుతుందని అనుకునేదాన్ని. ఈ కారణాలతో ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. అలా రోజులు గడిచేకొద్ది నా కంటే అమ్మకి మందు ఎక్కువ ఇష్టమనుకునే దాన్ని’ అదే కారణం..’అయితే నా తల్లి ఇలా కావడానికి నేను గానీ నా సోదరుడు గానీ తండ్రి గానీ కారణం కాదు. పరిస్థితులు ఆమెని అలా మార్చేసి ఉండొచ్చు.
ఇది ఓ మానసిక సమస్య అని ఆ తర్వాత తెలిసింంది. అలాంటి వాటికి బానిస అయితే త్వరగా బయటపడలేరనే విషయం నాకు అర్థమైంది. కుటుంబ పోషణ భారం కావడంతో ఆ వృత‍్తిలోనే నేను పనిచేయాల్సి వచ్చింది’ అని సన్నీ లియోన్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం హ్యాపీలైఫ్.. సన్నీ లియోన్ గతం ఎలా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆమె సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. డేనియల్ వెబర్‌ని పెళ్లి చేసుకున్న ఈమె.. భారత్‌లోనే సెటిలైపోయింది. ఇద్దరు కొడుకులు ఉండగా, మరో అమ్మాయిని దత్తత తీసుకుంది. సినిమాల్లో వ్యాంప్ తరహా పాత్రలు చేస్తున్నప్పటికీ.. బయటమాత్రం మంచి పనులు చేస్తూ తనపై పడిన ముద్రని చాలావరకు చెరిపేసుకుందనే చెప్పొచ్చు.