తెలంగాణ రాష్ట్రంలో గతంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో రాజకీయ పార్టీని పెట్టి సీఎం కేసీఆర్ పై, బీఆర్ఎస్ ప్రభుత్వంపై హోరాహోరీగా యుద్ధం చేసిన వైఎస్ షర్మిల అప్పట్లో కెసిఆర్ కుటుంబం చేసిన అవినీతిని తూర్పారబట్టారు.
తాజాగా రాష్ట్ర ఆర్థిక రంగానికి కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పెనుభారంగా మారనుందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక పేర్కొంది.
2022 మార్చికి కాళేశ్వరం ప్రాజెక్టు సంస్థకు మొత్తం రూ.96,064 కోట్ల రుణం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిందని తెలిపింది. ఇందులో 2022 మార్చి నాటికి రూ.87,449.15 కోట్లు తీసుకుందని పేర్కొంది.