షర్మిల..తన సోదరుడైన సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని ఆమె మాటల తూటాలు పేలుస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతల కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్న షర్మిల.. ఆ పార్టీ పేరులో వైఎస్ఆర్ అనే పదానికి కొత్త అర్థం ఇదంటూ.. ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే APCC చీఫ్ అవ్వడం వల్ల షర్మిలా ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చారు.
ఆమె రాష్ట్రంలో అంశాలపై పోరాటాలు చేస్తే.. అప్పుడు ఆమె స్థాయి.. రాష్ట్రంలో నేతలకే పరిమితం అవుతుంది. అలా కాకుండా జాతీయ స్థాయిలో పోరాటాలు చేయడం ద్వారా.. తమ పార్టీ జాతీయ పార్టీ అని గుర్తు చెయ్యడానికి షర్మిల ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఐతే.. రాష్ట్రంలో ప్రత్యేక హోదాతోపాటూ.. చాలా సమస్యలున్నాయి. వాటిపై కాకుండా ప్రత్యేక హోదాపైనే షర్మిల ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుందా అనేది తేలాల్సిన ప్రశ్న.