సమంతకు ఆ వ్యాధి ఇంకా తగ్గలేదా..? సినిమాలకు బ్రేక్ చెప్పి చికిత్స కోసం ఏకంగా.?

సమంత ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. అయితే ఈ సిరీస్ కోసం మాత్రం ఓ రేంజ్‌లో అంటే పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కూడా ఈరేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోలేదని టాక్. తాజాగా ఈ వెబ్ సిరీస్ షూటింగ్‌ కంప్లీట్ కానీకొచ్చింది. అయితే సమంత చేస్తున్న ఖుషి సినిమా, సిటాడెల్ షూటింగ్స్ పూర్తవ్వడంతో సమంత కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ ప్రకటించింది. కొత్త సినిమాలు కూడా ఇప్పట్లో ఒప్పుకోదని, ఆల్రెడీ చేతిలో ఉన్న ప్రాజెక్టులకు నిర్మాతలు ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేస్తున్నట్టు సమాచారం.

ఒక సంవత్సరం వరకు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నాను అని సమంత చెప్పడంతో అభిమానులు షాక్ కి గురయ్యారు. ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోతుంది. అయితే సమంత తన ఆరోగ్యంపై ఫోకస్ చేయడానికే సినిమాలకు బ్రేక్ ప్రకటిస్తున్నట్టు తెలిపింది. సమంత గతంలో మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు, చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. దాని చికిత్స కోసం కూడా కొన్నాళ్ల క్రితం ఒక ఆరు నెలలు షూటింగ్స్ కి దూరంగా ఉంది. మెడిసిన్స్ తో పాటు కేరళ ఆయుర్వేదం కూడా సమంత వాడినట్టు సమాచారం. అయితే సమంత సన్నిహితుల సమాచారం ప్రకారం సమంతకు ఇంకా మయోసైటిస్ తగ్గలేదని తెలుస్తోంది.

మయోసైటిస్ పూర్తిగా తగ్గలేదని, ఇంకా బాధపడుతుందని, త్వరలో అమెరికాకు ఈ చికిత్స కోసం సమంత వెళ్ళబోతున్నట్టు, కొన్నాళ్ల పాటు అమెరికాలోనే ఉండి సమంత మయోసైటిస్ కి పూర్తి చికిత్స తీసుకుంటుందని, సమంత పూర్తిగా కోలుకున్నాకే మళ్ళీ ఇండియాకు వస్తుందని సన్నిహితులు చెప్తున్నారు. అలాగే చికిత్స కొరకు సమంత సౌత్ కొరియాకు కూడా వెళ్తుందని పలువురు చెప్తున్నారు. అందుకే సినిమాలకు సమంత దాదాపు ఒక సంవత్సరం బ్రేక్ ప్రకటించిందని సమాచారం. దీంతో సమంత అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్ళీ సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారు అభిమానులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *