రాశీ.. 1997లో వచ్చిన జగపతిబాబు శుభాకాంక్షలు సినిమాతో స్టార్ అయిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గోకులంలో సీత, జగపతిబాబు పెళ్లి పందిరి, శ్రీకాంత్ ప్రేయసి రావే లాంటి సంచలన సినిమాలు చేసింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ ఈ భామకు మంచి గుర్తింపు వచ్చింది. ఇన్నేళ్ళ తర్వాత ఆ మధ్య లంక సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. అవకాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.
తన ప్రేమకథ గురించి కూడా ఓపెన్ అయిపోయింది ఈ సీనియర్ హీరోయిన్. అప్పట్లో ఈమె కోసం ఎంతోమంది కోటీశ్వరులు పోటీ పడ్డారు. రాశీని పెళ్లి చేసుకోడానికి బిజినెస్ మెన్ ఎందరో క్యూ కట్టారు. కానీ వాళ్లందరినీ కాదని ఓ అసిస్టెంట్ డైరెక్టర్‌ను పెళ్లి చేసుకుంది రాశి. అతడి పేరు శ్రీముని. రాశి నటించిన కొన్ని సినిమాలకు ఆయన సహాయక దర్శకుడిగా పని చేశాడు. అప్పుడే వాళ్ల మధ్య పరిచయం ఏర్పడింది.

అదే సమయంలో రాశీ తండ్రి చనిపోవడంతో ఆమెతో మరింత చేరువయ్యాడు శ్రీముని. ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడంతో నన్ను పెళ్లి చేసుకుంటావా అని తానే ముందు ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది రాశి. ఆయన కూడా ఓకే చెప్పడంతో రెండు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు రాశి. అప్పట్లో రాశీ భర్త ఓ సినిమా తెరకెక్కించాడు కూడా. భార్యను హీరోయిన్‌గా పెట్టి లంక సినిమా చేసాడు ఈయన. దానికి ముందు కూడా ఓ సినిమా చేసాడు ఈయన. కానీ అది అంతగా విజయం సాధించలేదు.