సమంత లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని బికినీ ఫోటోలను పంచుకుంది. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ మాత్రం.. సమంత నుంచి ఈ ఫోటోలను.. ఈ సమయంలో ఊహించలేదని.. అంటున్నారు. మరి ఈ రేంజ్‌లో ఫోటో షూట్ ఏంటీ.. అంటూ చురకలు అంటిస్తున్నారు. ఆరోగ్యమే సరిగా లేదు.. బికినీలో ఫోటోలు ఏంటీ.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం సమంత పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే సమంతను యాంకర్ జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు గురించి అడిగారు. ఆ సమస్యలను ఎలా ఎదుర్కొన్నారని యాంకర్ వివరణ కోరారు. సమంత మాట్లాడుతూ… గత రెండేళ్లలో నా జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. వివాహం, ఆరోగ్యం విషయంలో సమస్యలు ఏర్పడ్డాయి. ఇవి మానసిక ఒత్తిడికి గురి చేశాయి. ఈ సమయంలో నేను నాలాగే సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తుల జీవితాల గురించి చదివాను. వారు ఎలా ఫైట్ చేసి విజయం సాధించారో తెలుసుకున్నాను.
జీవితం అంటే హిట్స్, బ్లాక్ బస్టర్స్ కాదు. కష్టనష్టాలు, హార్డ్ వర్క్ అని నేను భావిస్తున్నాను. నాకున్న ప్రతి సమస్య మీద నేను పోరాటం చేస్తాను. నాలాగే సమస్యలు ఎదుర్కొంటున్న వారికి స్ఫూర్తిగా నిలుస్తాను, అని సమంత సమాధానం చెప్పింది. సమంత 2021లో నాగ చైతన్యతో విడిపోయింది. అధికారికంగా విడాకుల ప్రకటన చేసింది. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియా వ్యతిరేకత ఎదుర్కొన్నారు.