నాగ చైతన్య-సమంత రహస్యంగా కలుస్తున్నారా..? ఆ వీడియోతో అనుమానాలు.

తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు. కాని వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా విడిపోయి.. సమంతది తప్పంటే.. లేదు నాగచైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్దం చేశారు.విడాకులపై నాగచైతన్య ఎప్పుడు మాట్లాడింది లేదు. కాని సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరొక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు.

అయితే ఇటీవల నాగ చైతన్య వద్ద పని చేసే యువకుడు బైక్ కొన్నాడు. అతని కోరిక మేరకు నాగ చైతన్య బైక్ మీద ఆటోగ్రాఫ్ చేశాడు. అలాగే రైడ్ చేస్తున్నట్లు ఫోటోలకు పోజిచ్చాడు. ఈ వీడియోలో సమంత పెట్ డాగ్ హ్యాష్ కనిపించింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. సమంత పెట్ డాగ్ నాగ చైతన్య దగ్గరకు ఎలా వచ్చింది. దీని వెనకున్న రీజన్ ఏంటి? సమంత-నాగ చైతన్య రహస్య సంబంధాలు కలిగి ఉన్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

హ్యాష్ సమంత-చైతూ కలిసి ఉన్నప్పటి నుండి ఉంది. ఆ డాగ్ తో నాగ చైతన్యకు కూడా అనుబంధం ఉంది. విడాకులు అనంతరం సమంత వద్దే హ్యాష్ ఉంటుంది. దానికి తోడుగా మరొక డాగ్ ని సమంత తెచ్చుకుంది. మరి సమంత వద్ద ఉండాల్సిన హ్యాష్ చైతు దగ్గరకు ఎలా వచ్చిందనేది ఆసక్తికర అంశం. బహుశా అప్పుడప్పుడు సమంత పనివాళ్ళు చైతు దగ్గరకు హ్యాష్ ని తీసుకొస్తూ ఉండొచ్చు. సమంత-నాగ చైతన్య కలవడం మాత్రం జరగని పని అని కొందరి అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *