శేఖర్ మాస్టర్ ఇంట్లో తీవ్ర విషాదం. ఆమె మరణాన్ని తట్టుకోలేకపోతున్నఅంటూ..!

శేఖర్ మాస్టర్..దాదాపు తెలుగు ఇండస్ట్రీలలో అందరు స్టార్ లతో ఆయన డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. మూవీ ఇండస్ట్రీలో ఆయన కంటూ మంచి గుర్తింపు కూడా ఉంది. వదినా.. మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోయావ్.. నువ్వులేవనే వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం.. నువ్వు భౌతికంగా లేకున్నా.. నీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయి.

అయితే సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్నారు. కాగా శేఖర్ మాస్టర్ వదిన కన్నుమూశారని తెలుస్తోంది. ఆమె మరణానికి గల కారణాలను మాత్రం మాస్టర్ వెల్లడించలేదు. ‘వదిన మిస్ యూ.. నువ్వు ఎంతో బాధను అనుభవించావ్.. అయినా ఎంత ధైర్యంగా నిలబడ్డావ్.. నువ్వే నాకు ధైర్యాన్న నూరిపోసావ్.. జీవితంపై సానుకూల దృక్పథాన్ని అందించావ్.

ఇక నువ్వు లేవనే వార్తను ఇంకా జీర్ణించుకోలేకపోతోన్నాను. ఇప్పుడైనా మంచి ప్రదేశంలో (స్వర్గం)లో చేరి ఉంటావ్ అని ఆశిస్తున్నాను. నువ్వెప్పుడూ మాతోనే ఉంటావ్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనికి స్టార్ యాంకర్, ప్రముఖ నటి విష్ణు ప్రియ కామెంట్ చేశారు. అలాగూ ‘ ఓం శాంతి’ అంటూ అభిమానులు, నెటిజన్లు స్పందిస్తున్నారు.

ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రముఖ టీవీ ఛానల్లోని డ్యాన్సు షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు శేఖర్ మాస్టర్. అలాగే యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. వీటితో పాటు కొన్ని స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *