జగన్ పార్టీ పెట్టక ముందు నుంచే నేను రాజకీయాల్లో ఉన్న నాకు సీట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతా : రోజా

ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఈసారి ఎంత మందికి టికెట్ వస్తుందో? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

ఇప్పటికే పలువురిని పక్క నియోజకవర్గాలకు మారుస్తూ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈసారి దాదాపు 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ పక్కన పెట్టబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. మంత్రి రోజాకు కూడా ఈసారి టికెట్ ఇవ్వరనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో రోజా స్పందిస్తూ… తనకు టికెట్ రాదని తప్పుడు ప్రచారం చేస్తూ కొందరు శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. వారి ఆశలు ఫలించవని అన్నారు.

ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క చోట పోటీ చేస్తే గెలుస్తామో? లేదో? అనే భయంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేయాలనుకుంటున్నారని… రెండేసి నియోజకవర్గాల్లో సర్వేలు చేయించుకున్నారని ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *