రోజా మొదట్లో తన అందం, అభినయంతో తెలుగు, తమిళ ప్రేక్షకులను కట్టిపడేసింది. కథానాయికగా ఆమె విజయవంతమైన కెరీర్ చాలా సంవత్సరాలు కొనసాగింది మరియు ఆమె కళాకారిణిగా క్యారెక్టర్ రోల్స్‌లోకి మారింది. అయితే రోజా కూతురు అన్షుమాలికను సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చేందుకు రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. అన్షునూ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేసేందుకు సినీ నిర్మాతలు, దర్శకులు ఆమెకు మంచి ఆఫర్లు ఇస్తున్నారట.
ఎక్కువగా కోలీవుడ్ నుంచి సినిమా ఛాన్సులు వస్తున్నాయట. హీరోయిన్ గా వస్తే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతుందని రోజాకు భరోసా ఇస్తున్నారు. అంతే కాదు ఆమె అభిమానులు సైతం అన్షు ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. అన్షుమాలిక ప్రస్తుతం చదువుకుంటోంది. అయితే ప్రస్తుతం సినిమాల్లో నటించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. గతంలో విక్రమ్ కొడుకుతో కలిసి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండే. కొన్ని కారణాలతో వాయిదా పడింది.
మళ్లీ ఇప్పుడు అన్షు కోసం ఆఫర్లు వస్తున్నాయి. రోజా కూడా అన్షును ఇంట్రడ్యూస్ చేసేందుకు రెడీగానే ఉందంట. అయితే ఏపీలో త్వరలోనే ఎన్నికలు ఉండటంతో అన్షు ఎంట్రీ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎన్నికల అయిపోయిన తర్వాత అన్షు ఎంట్రీ ఖాయమంటున్నారు.