రోజా నీ గత చరిత్ర చెప్పమంటావా..? ఆ వీడియోలన్నీ బయటపెడతా.. టీడీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

రోజా నీ గత చరిత్ర చెప్పమంటావా? చంద్రబాబు రాజకీయ భవిష్యత్తును ఇస్తే అదే చంద్రబాబు జైలుకెళ్తే నువ్వు స్వీట్లు పంచుతావా? ఆ రోజుల్లో నువ్వు అప్పుల పాలైపోతే ఆ అప్పులు తీర్చింది చంద్రబాబు కాదా? రోజా మాటలను ఎవరు పట్టించుకోవాల్సిన పనిలేదు’’ అని బండారు సత్యనారాయణమూర్తి ఎద్దేవ చేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా చంద్రబాబు అరెస్ట్ గురించే చర్చ నడుస్తోంది. టీడీపీ నేతలు, అభిమానులు అయితే రోడ్ల మీదికి వచ్చి చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ బయట కనిపించని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఇప్పుడు బయటికి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

చంద్రబాబుకు మద్దతుగా మహిళలంతా బయటికి వచ్చి నిరసన తెలుపుతుంటే కావాలని మహిళలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అటెంప్ట్ మర్డర్ కింద కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా టీడీపీ నేతలను, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణిని టార్గెట్ చేస్తున్నారు. మంత్రి రోజా అయితే భువనేశ్వరిని అనరాని మాటలు అన్నారు. దీంతో టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దిగజారిపోయి పాత చరిత్ర మరిచిపోలేక, ఎన్టీఆర్ బిడ్డల మీద, భువనేశ్వరి మీద, బ్రాహ్మణి మీద అలా మాట్లాడటానికి నీకు అర్హత ఎవరు ఇచ్చారు రోజా. ఎన్టీఆర్ కుటుంబం అంటేనే ఒక ఆదర్శమైన కుటుంబం, మచ్చలేని కుటుంబం. వాళ్లు సంప్రదాయాలకే రోల్ మోడల్.

భువనేశ్వరి అమ్మ గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆమె ఏనాడూ కూడా రోడ్డు మీదికి రాలేదు. బాలయ్య బాబు కూతురు బ్రాహ్మణి మీద నువ్వు మాటలు మాట్లాడుతున్నావు. అసలు రోజా నువ్వు చేసిన పని ఏంటి.. ఏ సినిమాల్లో నటించావో తెలియదా? నువ్వు చేసిన పనులన్నీ మాకు తెలుసు. రికార్డింగ్ డ్యాన్సులు వేసుకునే నువ్వు, కిరాయికి వెళ్లిన దానివి నువ్వు.. ఇప్పుడు నువ్వు ఎన్టీఆర్ కుటుంబం మీద వాడు వీడు అంటావా? నువ్వు ఎన్ని లాడ్జీలలో పడుకున్నావు, నువ్వు ఒక బజారు దానివి. నీ అదృష్టం బాగుండి మంత్రి అయ్యావు. అసెంబ్లీలో మైకు ఉంది అని నీకు నచ్చినట్టు మాట్లాడుతావా? ఖబడ్దార్ రోజా.. నీ ఆ సినిమాలన్నీ బయటపెడతాం.. అని బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *