హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు, వెలుగులోకి షాకింగ్ విషయాలు.

ఈ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు హీరో రవితేజ, నవదీప్ సహా పలువురిని పలువురిని పోలీసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఇష్యూపై పెద్ద దుమారమే రేగింది. అయితే హీరో నవదీప్‌ ఇంట్లో నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో నవదీప్‌ 37వ నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు సోదాలు చేసే సమయంలో నవదీప్ ఇంట్లో లేరని తెలుస్తున్నది.

అయితే తనను అరెస్టు చేయవద్దు అంటూ ఇప్పటికే ఆయన కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదే కేసులో నిందితుడు రాంచంద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాంచంద్‌ నుంచి నవదీప్‌ డ్రగ్స్‌ కొన్నట్లు నార్కోటిక్‌ బ్యూరో చెబుతున్నది. దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో నవదీప్ మరోసారి హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నార్కోటిక్ పోలీసులు కూడా కౌంటర్ దాఖలు చేయనున్నారు.

హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్‌ రాకెట్‌ వ్యవహారంలో పలువురు ఫైనాన్షియర్లు పట్టుబడ్డారు. ఆగస్టు 31న మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫ్రెష్ లివింగ్‌ అపార్ట్‌మెంట్‌లో జరిగిన రేవ్ పార్టీని తెలంగాణ స్టేట్ నార్కోటిక్ బ్యూరో భగ్నం చేసింది. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారంతా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *