సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, కాంగ్రెస్ నేత వేం నరేందర్ రెడ్డితో మల్లారెడ్డి ఆయన అల్లుడు భేటీ అయినట్లు తెలిసింది. గురవారం మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాలు కూల్చివేస్తున్న క్రమంలోనే వీరు వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు.
గచ్చిబౌలిలోని నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన మామాఅల్లుళ్లు దాదాపు 2 గంటల పాటు చర్చించారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని వారు కోరినట్లు తెలిసిందే.
అలాగే తమ కాలేజీ భవనాల కూల్చివేతతో పాటు, మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికి మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని వారు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.