అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ను వివాహం జులై 12న జరగనుంది. అయితే.., ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అంటూ మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వేడుకలు వైభంగా జరుగుతున్నాయి. అయితే ప్రపంచం కుబేరుల్లో ఒకరు, భారత దేశంలో అత్యంత సంపన్నులైన ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఆకాశానికి పందిరి వేశారా అన్నట్లు అంబాని ఇంట్ల పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుబేరుడు అయినా ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి, రాధిక మర్చంట్ తో వివాహం జరుగుతుంది.
ఈ వేడుకను గుజరాత్ లోని జామ్ నగర్ పట్టణంలో నిర్వహిస్తున్నారు. ఇక అనంత్ , రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలకు దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలానే ఈ వేడుకల్లో పర్ఫామెన్స్ చేయనున్న రిహాన్నాకు ఏకంగా 8 నుంచి 9 బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. అలానే వంటల విషయం గురించి చెప్తే.. దాదాపు 2500 రకాల వంటలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు హాజరవుతున్నారు.
దాదాపు 1000 మందికి పై సెలబ్రీటులు, ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్టార్ క్రికెటర్స్ , సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు, రాజకీయ ప్రముకఖులు ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక వసతులను ఏర్పాటు చేశారు. రాయల్ టెంట్లను ఏర్పాటు చేసి.. అతిథులకు వసతి సౌకర్యం కల్పిస్తున్నారు. అయితే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్న అంబానీ అతిథులకు ఏంటి అలా టెంట్లలో అకామిడేషన్ అనే సందేహం చాలా మందికి వ్యక్తమవుతుందిత. అయితే అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.