కుమారి ఆంటీ తన సొంత స్థలంలో వ్యాపారం చేయడం లేదని.. ఆమె స్టాల్ వద్దకు వచ్చే కస్టమర్ల వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని.. దీని వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారనే కారణంతో.. పోలీసులు ఆమె ఫుడ్ వ్యాన్‌ను తరలించారు. అయితే కుమారి ఆంటీ.. ఇటీవల సోషల్ మీడియాలో మోత మోగిపోతున్న పేరు. హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్ ఛానెల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశాడు. దీంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు.
కేవలం హైదరాబాద్ వాళ్లే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈమె వద్ద ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు. సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య వాటిల్లింది. దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి.. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చిచెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు. దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది.
తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు. యధావిధిగా అదే ప్లేసులోనే ఉండి వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజల పాలనలో.. ప్రభుత్వం వ్యాపారస్తులతో ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని.. తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు వెళ్లి ఫుడ్ ఆస్వాదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.