రేవంత్ రెడ్డి .. పెద్దగా పరిచయం అక్కరలేని రాజకీయ నాయకుడు. సూటిగా, సుత్తి లేకుండా , ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా మాట్లాడగల సమర్ధుడు . ఎప్పుడు ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి,ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నా అంటూ ప్రశ్నించే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు మాత్రం కొరకరాని కొయ్య .
నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ మైదానంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించారు. అర్గుల్ రాజారామ్ మెమోరియల్ పేరిట ప్రారంభించిన ఫుట్ బాల్ పోటీల్లో కాసేపు రేవంత్ కూడా ఫుట్‌బాల్ ఆడి అలరించారు. విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్‌బాల్ ఆడారు. కాసేపు ఫుట్‌బాల్ ఆడిన అనంతరం ప్లేయర్స్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి కాసేపు మ్యాచ్‌ను వీక్షించారు. రేవంత్ స్వయంగా గ్రౌండ్‌లోకి దిగి ఫుట్‌బాల్ ఆడటం అందరినీ ఆకట్టుకుంది.
అయితే తనకు ఫుట్‌బాల్ ఆడటమంటే బాగా ఇష్టమని, సమయం దొరికినప్పుడు ఆడుతూ ఉంటానని రేవంత్ ఇటీవల పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. ఫుట్‌బాల్ ఆడటం వల్ల ఫిట్‌నెస్ కూడా వస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఉంటే ఫుట్‌బాల్ ఆడతానని ఇటీవల పలు ఛానెల్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలలో రేవంత్ వెల్లడించారు.