స్త్రీ పురుషులు న*గ్నంగా వెళ్లే దేవాలయం. ఎక్కడో కాదు, మనదేశంలోనే..!

కొన్ని దేవాలయాల్లో అయితే ఇటువంటి దుస్తులు మాత్రమే దరించాలన్న నిబంధన అంటే డ్రస్ కోడ్ ను కూడా ఇటీవల అమలు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలు చాలా పవిత్రంగా ఉండాలన్నదే ఈ నియమం ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే దేవాలయం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ భక్తులు నగ్నంగా దేవి దర్శనం చేసుకునేవారు.

అందులోనూ స్త్రీలు, పురుషులు ఇద్దరు ఒకేసారి ఈ విధంగా నగ్నంగా వెళ్లేవారు. సమాచార సాంకేతిక రాజధానిగా పిలిపించుకునే కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలోని సొరబు తాలూకాలో ఈ దేవాలయం ఉంది. ఈ సొరబు పట్టణానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో చంద్రగుట్ట అనే చిన్న కొండపై ఉంది. ఈ చంద్రగుట్టనే గుత్తియమ్మ కొండ అని కూడా పిలుస్తారు.

ఇక ఈ గుట్ట పైన రేణుకాదేవి దేవాలయం ఉంది. ఒక చిన్న అర్థచంద్రాకారం గుహలో ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడ రేణుకాదేవికి గుడిని దాదాపు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో కట్టించారని చెబుతారు. ఇదిలా ఉండగా ఇక్కడ రేణుకాదేవి గుడికి పురాణ కాలం నుంచి భక్తులు అందులోనూ స్త్రీ, పురుషులు కలిసి నగ్నంగా వెళ్లేవారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *