తిరువనంతపురంలోని శ్రీకార్యంలో తన ఫ్లాట్లో సోమవారం రంజుషా మీనన్ శవమై కనిపించారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆమె బలవన్మరణానికి పాల్పడడానికి గల కారణాలను శ్రీకార్యం పోలీసులు అన్వేషిస్తున్నారు. అయితే ప్రముఖ మలయాళ నటి రెంజూష మీనన్ ఆత్మహత్య కేరళలో తీవ్ర సంచలనం రేపింది. తిరువనంతపురంలోని శ్రీకార్యం ప్రాంతంలోని తన అపార్ట్మెంట్లో ఆమె శవమై కనిపించింది.
ఉరి వేసుకుని రెంజూష మీనన్ బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న మలయాళ సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ షాకయ్యారు. ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. రెంజూషా మీనన్ మలయాళ సీరియల్ ‘స్త్రీ’తో నటిగా రంగప్రవేశం చేశారు. ఆ తర్వాత ఆణె అనేక చిత్రాలలో కీలక పాత్రల్లో నటించింది.
తన భర్తతో కలిసి అపార్ట్మెంట్లో నివసిస్తోంది. అయితే ఆమె మరణానికి కొన్ని గంటల ముందే తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో రీల్స్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది. అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడంతో అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఆమె ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ఆ కారణంతోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు.