రష్మిక మందన్నా మరో మార్ఫింగ్ వీడియో వైరల్, ఈసారి అంతకు మించి..!

తాజా వీడియోలో రష్మిక జిమ్ సూట్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో కచ్చితత్వంతో కూడిన ఫేక్ వీడియోలను రూపొందించే వెసులుబాటు ఉంది. ఒరిజినల్ వీడియో ఉంటే తప్ప, ఫేక్ వీడియోనే నిజమైన వీడియో అని భ్రమపడేలా ఏఐ డీప్ ఫేక్ వీడియోలు ఉంటాయి. అయితే టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందాన డీప్ ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవగా….

దీనిపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. అయితే ఆమెకు సంబంధించిన మరో మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియోను ఆమె అభిమానులు షేర్ చేస్తూ ఇది కూడా ఫేక్ అని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఇలాంటి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు కొందరు దుండగులు. ఇది ఇలా ఉండగా..హీరోయిన్‌ రష్మిక మందానకు చెందిన మొన్న వైరల్‌ అయిన మార్ఫింగ్ వీడియోపై స్పందించారు కీర్తి సురేశ్. నేషనల్ క్రష్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసి రష్మిక ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే కొందరు రష్మికపై ఇలాంటి వీడియోలు చేసి ఆమె ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో తీవ్రంగా మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *