మోటివేషనల్ వీడియోలు చేస్తూ.. యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ ఎంతో ఫేమస్ అయ్యాడు. అలానే నేత్రా సేంద్రీయ వ్యవసాయం చేసి విజయం సాధించడమే కాక.. అందుకు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
దీని కన్నా ముందు నేత్రా రెడ్డి సినిమాల్లో కూడా నటించింది. సొంతంగా గుర్తింపు తెచ్చుకున్న వంశీకృష్ణ-నేత్రా ఇద్దరు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తల్లిదండ్రులు వీరి పెళ్లిని అంగీకరించలేదు. దాంతో వీరిద్దరే వేరుగా కలిసి ఉండేవారు.
వారధి ఫామ్స్ అనే కంపెనీ ప్రారంభించి.. దీని ద్వారా సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు అమ్మడం ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయం, ఉత్పత్తులకు సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తూ.. ఎంతో ఫేమస్ అయ్యారు.